4.08.2017

Hair the pride of women - a touching video

ఓ వాలుజడా..మల్లెపూల జడా..ఓ పాము జడా..సత్యభామ జడా
రసపట్టు జడా..బుసకొట్టు జడా..నసపెట్టు జడా ఇపుడెందుకే ఈ రగడా

నాగరం ధరియించిన
నాగుబామొక్కటి
నవ్వుచూ నిలుచుండి చూస్తున్నయట్లు
నల్లని వాలుజడ అనిపించ
పెళ్ళిచూపులకొచ్చిన పెళ్ళికొడుకు
పిల్ల వెళుతుండగా అందమైన జడను
పరవశముతో గాంచుచూ
పెళ్ళికి వెంటనే ఒప్పుకొనగ 


ఇలా జడ గురించి ఎన్నెన్ని వర్ణనలు, కను ముక్కు తీరు బాగున్నా జడ ఎలా ఉంది అని చూసేవాళ్ళు పూర్వపు రోజులలో.... జడతో కొట్టక మానను అనే మాట మరువగలమా... జడను గురుంచి ఎన్నెన్ని కావ్యాలు , రాసికప్రియుల మన్మధ బాణం జడ అంటారు సాహితీ ప్రియులు. అలాంటి జడ, జుట్టు పొడుగు ఉన్న ఓ అమ్మాయి ఓ బ్యూటీ పార్లేల్ కి వెళ్తుంది ఆమె జుట్టు చూసి ఆ బ్యూటీ పార్లేల్ అమ్మాయిలు ముచ్చట పడి పోతారు చివర కట్ చేస్తే చాలా అని అడుగుతారు. ఉహు ఇంకొంచం , ఇంకోచం అంటూ వాళ్ళు ఆ జుట్టు ని బాబ్డ్ హెయిర్ చేసేదాక వదలలేదు మనసు రాకపోయినా కస్టమర్  సాతిస్ఫక్షన్ బుసినెస్ ధర్మం కాబట్టి తప్పక ఆమె చెప్పినట్లు చేసారు. ఆమె కన్నీటితో తన జుట్టుని తడుముకుంది. కింద పది ఉన్న పొడవాటి జుట్టు ఆనవాళ్ళని చూసి బాధపడుతుంది. మళ్ళీ ఒకసారి జుట్టు కట్ చేసిన ఆమె వైపు చూసి పిడికిలో జుట్టు పట్టుకుని కన్నీటితో అంటుంది కనీసం ఇలా పిడికిలికి కూడా రాకుండా జుట్టు కట్ చేయగలవా అని అడుగుతుంది . ఎంత ఆర్థ్రం అందులో ఎంత అర్థం నిగూఢమయి ఉంది. జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టే పురుషాధిక్య ప్రపంచంలో ఉన్నామని, జుట్టే మన గర్వకారణం అని మురిసిపోతున్నాము కాని అదే మనపాలిత శత్రువు అవుతోంది అని తెలియజెప్పే ఒక అద్భుతమయిన వాణిజ్య ప్రకటన. మనసుని కలిచివేయకమానాడు ఈ ప్రకటన మీరు చూడండి. కంటనీరు తెప్పించే ఈ స్లోగన్ కూడా hair the pride of women ....అవును బానిసగా బతకడానికి ఒకరి పిడికిలో మిగలడానికి ఉపయోగపడ్తున్న జుట్టు అది... టచింగ్ వీడియో

8.10.2016

పెళ్లిపుస్తకంలోని 23 పేజీలోకి వచ్చాము.


ప్రేమకి (పెళ్ళికి ) స్వీట్ 16 .....................20.........23

అదన్నమాట సంగతి ! అలా మొదలయి .. ఇలా 20  లోకి అడుగుపెట్టి ... ఇంకో మైలు రాయి చేరుకున్నాము..  

 మూడు సంవత్సారల క్రితం రాసిన గత జ్ఞాపకాల పెళ్ళి రోజు ఆనందమిది..మళ్ళీ మూడు సంవత్సరాల తరువాత ఈరోజు 11-8-2016 23 కి అడుగుపెడుతున్న శుభ సందర్బాన మళ్ళీ ఈ పోస్ట్ బయటకి తీశాను. ఇరు మనసులని/తనువులని కలిపే పెళ్లి ఒక గొప్ప కళ
కాని ఆ పెళ్లితో
కలకాలం అన్యోన్యంగా కలిసి ఉండడం 64 కళల్లో కల్లా గొప్పది." రమణి రాచపూడి.
****

22 సంవత్సరాల క్రితం ఈరోజు పెళ్లి కూతురిని చేసారు.., కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ,అరుచుకుంటూ.. అన్యోన్యగా 22 సంవత్సారాలు పూర్తీ చేసాము. ఈరోజుకి . రేపు 23 ఏట అడుగుపెతున్నాము ఒక్కో మైలు రాయిని దాటుకుంటూ ఆటుపోట్లు ఎదుర్కొంటూ ...


16 ఏళ్ళ క్రితం ఆగస్ట్ 11 తెల్లవారుఝామున
"ఏంటే ఈ నిద్ర, లే అవతల పంతులుగారు హడావిడి పడ్తున్నారు, అమ్మాయిని తీసుకుని రమ్మనమని, ఇంత మొద్దు నిద్ర అయితే ఇహ మొగుడితో కాపురం ఎలా చేస్తావు, లెమ్మంటుంటే ముహూర్తం మించిపోతుంది.."
"అబ్బా.. ఈ అర్థరాత్రి పెళ్ళిళ్ళు ఎవరు కనిపెట్టారమ్మా బాబు!, నిద్ర లేపి మరీ .. తరువాత చేసుకుంటాలే పడుకోనీ"
"బాగుంది సంబరం.. వచ్చినవాళ్ళందరిని నీ నిద్రకోసమని వెను తిరగమంటావా? అతి వేషాలు మాని తొందరగా లే. ఆ మూడు ముళ్ళేవో పడిపోతే కాస్త నా ప్రాణం కుదుటపడుతుంది.  "*****
ఆరు నెలల తరువాత

"నడవలేనండి బాబు ఇంత దూరమా.. ప్లీజ్ ఇంక చాలు"

"ఇదిగో ఇంకొంచం దూరమే అదిగో అక్కడ కనిపిస్తోందే హోటెల్, అక్కడికి వెళ్ళి కొంచం టిఫిన్, కాస్త కాఫీ తాగేసి బయల్దెరుదాము సరేనా.. నడవాలి నడవకపోతే తరువాత నువ్వే సమస్యలు ఎదుర్కుంటావు. నా బంగారం కదా కాస్త దూరమే.."

"కాస్త దూరమా .. మళ్ళి బయలుదేరడమా ఆటోలో వెళ్ళిపోదామండీ నాకే టిఫిన్లు అవి వద్దు, నడవడమే కష్టంగా ఉంది. (కళ్ళనీళ్ళ పర్యంతంతో) "

"తొలిచూలు కదా ఎంత నడిస్తే అంత మంచిదని మా బామ్మ చెప్పేది. వినకపోతే ఎలా? కాస్త ఓపిక పట్టు..."

"ప్చ్.. అబ్బా ... ఇదేమి నరకం భగవంతుడా!! ఇంత దూరం నడకా ఇలాగా??"

"తప్పదు"
****
మొదటి సంవత్సరం పెళ్ళిరోజు

" సంవత్సర కాల మన  వైవాహిక జీవితంలో ఎప్పుడన్నా నన్నెందుకు చేసుకున్నానో  అని బాధ పడ్డావా?"

"లేదే, అలా ఎందుకు అడుగుతున్నారు? "

"నాలో ఏమన్న నచ్చని అంశం  ఉంటే చెప్పేయి, నేను మార్చుకుంటాను, అలాగే నీలో ఏమన్న నాకు నచ్చకపొతే కూడా నేను చెప్పేస్తాను. "

ఆ తరువాయి రెండేళ్ళ తరువాత

"నడవలేనండి బాబు ఇంత దూరమా.. ప్లీజ్ ఇంక చాలు"

"మరీ కొత్తలా ఏంటది, తెలుసు కదా పాప పుట్టడం ఎంత సులువయిందో, అలా నడవబట్టే కదా మరి మళ్ళి ఎందుకు అలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కష్టం గానే ఉంటుంది తరువాత నువ్వే ఇబ్బంది పడతావు నీ మంచికోసమే కదా నడవరా..."
"హు! తప్పదా.. పాప అప్పుడు ఏమి కాలేదు కదా .. ఇప్పుడు కూడా ఏమి కాదు లెండి వదిలేయండి బాబు నడక కాస్త కష్టంగానే ఉంది. "

"ఉహు! తప్పదు"
******

అలా సంవత్సరాలు  గడిచిపోతున్నాయి ఎన్నో మధురానుభూతులతో, మరెన్నో మలుపులతో ఇంకెన్నో మార్పులతో.. తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో అని చెప్పుకుంటూ,  ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని మా  పెళ్ళిని(ప్రేమ )  టీనేజ్లోకి తీసుకొచ్చాము. అంటే స్వీట్ సిక్స్‌టీన్‌లోకి అన్నమాట.. ఇంకా ఎన్ని పండగలు చూస్తామో, ఎంతవరకో పయనం?

 బోల్డు బాధ్యతలు బంధాల నడుమ కొట్టుమిట్టాడుతున్న ప్రతిసారి తను అడిగే మాట .. "నాతో ఎప్పుడన్నా ఇబ్బంది పడ్డావా?"  ఎన్నో పొరబాట్లు చర్చించుకుంటూ ...సరిదిద్దుకుంటూ..  నడిపే ఈ భవసాగరానికి 16 ఏళ్ళు. (ఇప్పుడు 20 ఏళ్ళు) ఇంకో 3 ఏళ్ళు కలుపుకోవాలి 23 ఏళ్ళు ...  మలుపులకోసమో మార్పులకోసమో ఎదురుచూపులు. ప్రేమ, పెళ్ళి, బాధ్యతలు ఇదేనా జీవితం, జీవన పరమార్థం అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి.. :-)
*****
Loading...