6.30.2010

కుటుంబం

" వాళ్ళ కుటుంబం నాకంత నచ్చలేదు అందుకే అతనితో పెళ్ళి వద్దు అనుకుంటున్నాను. "  ఒకమ్మాయి ఉవాచ,

"మాది చాలా మంచి కుటుంబం ఆంటీ. మీరు చెప్తే నమ్మరు కాని మేమంతా చాలా సరదాగా ఉంటాము కలిసి ఉంటాము"  మాటల సందర్భంలో ఒక 23 ఏళ్ళ అబ్బాయి మాటలు ఇవి.

ఇద్దరి  మనస్థత్వాల అభిప్రాయాలివి.

****
నా పెళ్ళికి ఒక సంవత్సరం ముందు అనుకుంట నా ప్రియ స్నేహితురాలి పెళ్ళి అయ్యింది. తన పెళ్ళికి వచ్చిన ఒకే ఒక అడ్డంకి వాళ్ళ అక్క పెళ్ళి అవకపోడం. ఎందుకు అవలేదు అని అడిగి కారణం తెలుసుకున్నవారు ఆశ్చర్యపోక తప్పదు. ఒక సంబంధం అబ్బాయి బాగోకపోవడం అయితే అన్నీ కుదిరి శుభలేఖల దాకా వచ్చిన సంబంధం "ఛ అబ్బాయి పేరేంటి నాకసలు నచ్చలేదని" పెళ్ళి రద్దు చేసుకుంది ఆ స్వతంత్ర భావాలు కలిగిన ఆ అమ్మాయి. (ఇప్పటికి పెళ్ళి కాలేదు అది వేరే విషయం అనుకొండి) అంతా బాగుండి, పేరు బాలేదనో, కుటుంబం నచ్చలేదనో వెనక ముందు ఆలోచించకుండా ఇలా పెళ్ళిళ్ళు వద్దు అనుకుంటే ఎలా? అసలు పేరు బాలేదు అంటే మార్చుకునే అవకాశం లేదా? కుటుంబం గురించి పూర్తి అవగాహన లేకుండా , చక్కటి సంబంధాలని మిడి మిడి జ్ఞానంతో వెనక్కి పంపుతున్న అమ్మాయిలకి కనీసం తల్లి తండ్రులన్నా  ఏమి చెప్పరా?  ఉన్నత చదువులు చదివి వారికంటూ ఒక వ్యక్తిత్వాన్ని సంతరించుకున్న వారయినా ఈ కుటుంబం విషయలో అంతగా ఆలోచించలేరు. కారణం ఉంది, అప్పటిదాక తను,  తన ఇల్లు, తన చుట్టాలు మొ! తప్పితే పెద్దగా బయట ప్రపంచం తెలియనివాళ్ళే ఉంటారు. తెలిసినా అవతలి కుటుంబం  వాళ్ళు మనకన్నా కొంచం వేరుగానో కొంచం సాంప్రదాయబద్దంగానో కనిపిస్తే ...మనకి కలిగే భావన మన కుటుంబం మాత్రమే మంచిది అన్న భావన కలుగుతుంది. ఎందుకంటే మన కుటుంబంలో అయితే మనకి పూర్తి స్వతంత్రం.. పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అది మన ఇంట్లో తప్పితే మనది కాని ఇంకెవరి ఇంట్లో నన్నా ఉన్నట్లు అనిపించినా మనం అవతలి వాళ్ళకి అతిధులమే.


మా పాపన్నా తరచూ వాళ్ళ నాన్నగారు నాకు పనిల్లో చేదోడు వాదోడుగా ఉన్నప్పుడు..." డాడీ లాంటి మనిషినే పెళ్ళి చేసుకోవాలి అమ్మా!!"  అంటుంది. నిజానికి మా పాపకి ప్రస్తుతం తెలిసింది మా కుటుంబం , మా బంధువర్గాలు అంతే ఇంకా బయట ప్రపంచం తెలీదు కాబట్టి, చూసినవాళ్ళల్లో తన డాడీ తనకి, నాకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు కాబట్టి అనే మాటలవి. నిజానికి మాకన్నా మంచి కుటుంబాలు ఉంటాయి... పనులేమాత్రం చేయకపోయినా మావారికన్నా కూడా మంచివాళ్ళు ఉంటారు. ఆ విషయపై పూర్తి అవగాహన లేదు మా పాపకి.... మా పాపకనే కాదు చాలావరకు ఇప్పటి ప్రేమ వ్యవాహారాల్లో మునిగి తేలుతున్న ప్రతి ఒక్కరికీ "కుటుంబం " అనేది పెద్ద సమస్య. మన కుటుంబంలా లేరు అని అనేస్తారు. ఒకసారంటూ ఆ ఇంట్లో అడుగిడిన తరువాత అక్కడి వారి మనస్థత్వాలని గమనించి, మంచివయితే వాళ్ళతో కలిసిపోడం లేదా భర్తకి చెప్పుకుని సంధర్భానుసారంగా ప్రవర్తించి పరిస్థితులకి మనం లొంగకుండా, పరిస్థితుల్నే మనకి అనుగుణంగా మార్చుకునే నైపుణ్యం అలవర్చుకోవాలి కాని, పేరు బాలేదనో కుటుంబం నచ్చలేదనో జీవితాలని మార్చేసుకోడం .... ఒక స్థిరమైన అభిప్రాయలు లేకపోడం, త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది.

ఈ మధ్య ఇలాంటి సంఘటనలు చాలా చూస్తున్నాను. అబ్బాయిలేమో చాలా సున్నితంగా ఆలోచించుకుని, ఆ అమ్మాయిని తప్పితే చేసుకోనని, ఎన్నాళ్ళయినా ఎదురుచూస్తానని ప్రతిన బూని పీకలలోతు ప్రేమలలో మునిగిపోతుంటే ,  దానిని తృణిప్రాయంగా భావిస్తూ.. పేరు బాలేదు,  కుటుంబం నచ్చలేదు ,  మీవాళ్ళు నచ్చలేదు అంటూ చిన్న చిన్న కారణాలు చూపిస్తూ పెళ్ళికి వ్యతిరేకిస్తుంటే, అసలు ప్రేమకి అర్థం ఉందా అనిపిస్తుంది. ప్రేమిస్తున్నాను అన్నప్పుడే ఇలాంటి ఆలోచనలను చెప్పాలి, పెళ్ళిదాకా వచ్చినప్పుడు ఇలాంటి చిన్న కారణాలు చెప్పడం అనేది  పెళ్ళి అనే ఒక తంతుని వారు కలిసి నడుద్దామనుకున్న ఆ ఏడు అడుగులని వెరసి వారి వారి జీవితాలని వారు అవమానించుకున్నట్లు కాదా? ప్చ్! చూద్దాము వీళ్ళల్లో మార్పు రావాలని,  కోరుకుంటూ...  :-)

6.28.2010

వ్రతం. పిల్లి, ఒక చిల్లు బుట్ట .... ఆచారాలు

ఆచార వ్యవహారాల నేపధ్యంలో....  ఈరోజు నేను  విన్న నాకు నచ్చిన చిన్న కథ

దాదాపు ఒక నెల రోజులనుండి చిన్న పని నిమిత్తం అమ్మ మా ఇంట్లోనే ఉంటోంది. చెప్పేదేముంది అమ్మ ఉంది అంటే మా ఇంట్లో టి వి కి విశ్రాంతి ఉండదు. తెల్లవారు ఝామున 5 గంటలకి దానికి పని అప్పచెబితే, రాత్రి 12 గంటలవరకు శ్రమ అనుకోకుండా ఏ ఛానెల్ కావాలంటే ఆ ఛానెల్ నిరాటంకంగా చూపిస్తుంది (కరెంట్ మాపై కక్షబూని, మా అమ్మని కరుణిస్తే) ఈ టి వి చూడడం అనే విషయంలో మా అమ్మ ఎంత ఉద్ధండురాలంటే మేమెవరన్నా పొరపాటున టైం ఎంతయిందో అని ఏ వాల్ క్లాకో, చేతి గడియారమో చూసుకుందామని పసిగట్టిందో ఇహ చెప్పనవసరం లేదు.. ఇప్పుడు చిట్టెమ్మ వస్తోంది కదా... టైం ఇంత.. ఇందాకే భగవ్గీత ప్రవచనాలు అయ్యాయి,  అప్పుడనగా చెప్పాను ఆ వెధవకి తీసుకురమ్మనమని..  ఇదిగో అదేదో రేకులు సీరియల్ టైం కి తెచ్చాడు. అంటూ తన సీరియల్ భాష అంతా మా మీద ప్రయోగించేస్తుంది. అటొచ్చి .....ఇటొచ్చి లేదా ఒక చుక్క కాఫీ తాగుతూనో, కొన్ని సీరియల్స్‌లో  లేదా కొన్ని భక్తి సందేశాలో మా చెవిన అలా అలవోకగా పడ్తూ ఉంటాయి.

అలాంటి నేపధ్యంలో ఈరోజు పొద్దున్న నేను విన్న ఈ కథ నాకు చాలా నచ్చిన కథ, ఏ ఆచారాలన్నా దురాచారాలన్నా మనం సృష్టించుకున్నవే, వాటిని పాటించడంవల్ల ఎదుటి వారు ఇబ్బంది పడ్తున్నారు అంటే మార్చుకోడం, మార్పు కోరడం తప్పుకాదు అన్న సందేశం కూడా నాకు చాలా నచ్చింది. 

ఇక్కడ ఇంకో చిన్న విషయం చెప్పాలి. శంఖంలో పోస్తే కాని తీర్థం కాదని ఒక నానుడి... ఆచారాలు మనం మార్చుకోడం, మార్పు కోరడం విషయం గురించి ఇంతకు ముందు చాలా సార్లు నా  బ్లాగులో కూడా చెప్పాను. కాని ఇలాంటి విషయాల్లో అంత తొందరగా మార్పు రాదు కాని, ఫలనా పీఠాధిపతి చెప్పారనో, లేదా ఫలానా పేరున్నవారు చెప్తేనో దాని గురించి "అవును సుమా ! నిజమే " అని అనేవారున్నారు. అంతకు ముందు అదే విషయాన్ని మాలాంటి మామూలు అతి సామాన్య మనుషులు  నెత్తి నోరు బాదుకుని చెప్పినా,  దాని గురించి కూరలో కర్వేపాకు తీసేసినంత తేలికగా  తీసుకునేవారు చాలా మంది ఉన్నారు. మరి ఆ చెప్పేవాళ్ళు మనలా మనుషులు ..మనం చెప్పేదే  వాళ్ళు చెప్తున్నారు కదా అని అనుకోరు.  అదేంటో ఒక్కోసారి పత్రికలో కూడా రాస్తూ ఉంటారు. పత్రికలో రాసినప్పుడు.. "ఎంత బాగా రాసారో.... ఇలా చేయాలి .. "  అని దృఢ నిశ్చయం చేసేసుకునే వాళ్ళు,  వాళ్ళ వాళ్ళు ఎప్పుడన్నా ఈ విషయం గురించి చెప్పారా?  అని ఆలోచించరు.. పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు అన్నట్లు, ఇలా ఉండేవాళ్ళు చాలా మంది మా (నా ) ఎరికలో . :-)

సరే ఇక అసలు విషయం.. కథలోకి.. వెళ్దామా
*****
పూర్వం ఒక కుటుంబ పెద్ద ఒక వ్రతం చేయ నిశ్చయించుకుని, బ్రహ్మం గారిని పిలిపించారు. వ్రతం చాలా సందడిగా, ఏ లోటు రాకూండా జరగాలని బంధు మిత్ర సపరివార సమేతాన్ని కూడా ఆహ్వానించారు. పూజకి అన్ని ఏర్పాట్లు చేసుకుని, దంపతులురివురూ పీటలమీద కూర్చుని పూజ ప్రారంభించేంతలో, ఒక పిల్లి అటుగా వచ్చింది. ఒకసారి దానిని అటువైపు రానీకుండా దూరంగా తరిమేశారు. మళ్ళీ బ్రహ్మం గారు పూజ ప్రారంభించేంతలో, మళ్ళీ పిల్లి వచ్చి "మ్యావ్ " అంటూ అక్కడ వారిని పూజ చేసుకునేందుకు లేకుండా అడ్డుగా కూర్చుంది, మళ్ళీ యధాప్రకారం దానిని దూరంగా తరిమేసి పూజ చేద్దామనుకున్నారు. 


ఇలా మూడు నాలుగు సార్లు జరిగేసరికి ఆ కుటుంబ పెద్దకి ఈ ఆటంకం పెద్ద చికాకుగా తోచి, తన పెరట్లో ఉన్న ఒక చిల్లుల తటాకు బుట్టని తీసుకుని వచ్చి దానితో అక్కడే ఉన్న పిల్లిని మూసి ఉంచారు. అలా చేసిన తరువాత ఆరోజు వ్రతం ఎంతో సంతోషంగా .. నిరాటంకంగా జరిగింది. అందరూ ఆనందపడ్డారు. వ్రత ఫలం కూడా ముగిసింది. 

ఇలా ఆ వ్రతమేదో ముగియగానే వారికి వ్రతఫలంగా తర తరాలు తరిగిపోని చక్కటి భక్తి ప్రపత్తులు, సుఖ సంతోషాలు కలిగాయిట. ఆ కుటుంబ పెద్ద ఎంతగానో సంతోషించి ఈ వ్రతం తమ ఆచారంగా పాటించి తాను ఉన్ననాళ్ళు ఒక ఆచారంలా దానిని నిర్వహించారుట . ఇహ తన తదనంతరం కూడా ఈ "వ్రతం" ఆచరించాలని తన వారికి కూడా చెప్పారుట. ఇలా వారి కుటుంబాలు ఈ వ్రతాన్ని క్రమం తప్పక ఆచరించారు. సరే! కుటుంబ తర తరాలు గడచిపోయింది తరువాతి తరం, తరువాతి తరం, ఆ తరువాత స్థలం, అంతా మార్పులు .... కుటుంబ పెద్ద ఆదేశానుసారం వారి తరువాతి తరువాతి తరం వారు వ్రతం చేసుకుంటున్నారు. ఇక్కడ బ్రహ్మం గారు కూడా తరువాతి తరువాతి తరంవారు. పూజకి అన్ని సిద్ధం చేస్తున్నారు, దంపతులిద్దరిని పీటలు మీద కూర్చోమని పూజ ప్రరంబిద్ధామని బ్రహ్మం గారు ఉపక్రమించేంతలో ఆ తరువాతి తరం, నేటి తరం మనిషి, "మా తర తరాల ఆచారం, పిల్లి బుట్ట కావాలి అని అన్నారుట" బ్రహ్మం గారు కించిత్ ఆశ్చర్యంతో ... "ఈ వ్రతం తెలుసు కాని ఈ పిల్లి,  బుట్ట ఏంటి ఎక్కడా వినలేదు" అని ... సంశయం వెలిబుచ్చారు. మా ముత్తమ్మమ్మ , మా అమ్మమ్మ , మా తాతయ్య వీళ్ళందరూ ఈ వ్రతం చేసేప్పుడు పిల్లిని బుట్టలో ఉంచేవారు, ఇది మా ఆచారం .. ఇప్పుడు మీరు కూడా ఆ పని చేయాల్సిందే అని... ఆ తరం పెద్దమనిషి అన్నారుట, ఇప్పుడు ఈ కాంక్రీటు అరణ్యంలో .. పిల్లిని , బుట్టని నేనెక్కడ తీసుకురాను (ఇక్కడ పిల్లి బుట్ట తీసుకురావడం పెద్ద సమస్య కాదు అని అనేవాళ్ళతో నేను వాదించలేను కాని...) అని ఆ బ్రహ్మంగారి ఉవాచ.

చూశారు కదా ఫ్రండ్స్, అప్పుడేదో ఆ కుటుంబ పెద్ద తనకి ఈ పిల్లి వ్యవహారం చికాకుగా తోచి అలా దానిని అటూ ఇటూ కదలనీయకుండా వ్రతం నిరాటంకంగా చేస్తే...  ఆ చికాకు వ్యవహారాన్ని తరువాతి తరం వారు ఆచారం పేరిట... దానిని పెంచి పోషిద్దామనుకోడం ఎంతటి హాస్యస్పదం...ప్చ్... :) 

మనకి ఇబ్బంది అనుకుంటే  ఈ ఆచారం .... ఈ పిల్లి వ్యవహారం అవసరమా? ప్చ్!  మనిషికి వ్రతఫలం, పిల్లికి (బ్రహ్మంగారికి)  ప్రాణ సంకటం... బాగుంది కదా, పొద్దున్న భగవధ్గీత  గురించి  చెప్తూ కాకినాడ పీఠాధిపతిగారు చెప్పిన ఈ కథ ఇలా... మీదాకా.... నచ్చలేదా? పోని వదిలేద్దాం. రెపో ఎల్లుండో ఇంకో సరికొత్త టాపిక్ తో మీముందుంటా.
*******

'If'

This poem by Kipling, is framed and hung in the cabin of each and every cadet in the National Defence Academy, Khadkavasla. Cadets do read it often, may be only what is relevant to particular occasions from time to time. Many draw inspiration from the stanza, 'If you can force your heart and nerve and sinew, To serve their turn long after they are gone'; as well as, 'If you can fill the unforgiving minute with sixty seconds' worth of distance run', and of course the last line, 'And what is more, you'll be a man my son', which of course they all, still in their teens wanted to be acknowledged as.
Do read it and preserve it. Though idealistic, I'm sure it will nevertheless provide inspiration, especially to the younger generation.
Love & best wishes,

'If' first appeared in his collection 'Rewards and Fairies' in 1909. The poem 'If' is inspirational, motivational, and a set of rules for 'grown-up' living. Kipling's 'If' contains mottos and maxims for life, and the poem is also a blueprint for personal integrity, behaviour and self-development. 'If' is perhaps even more relevant today than when Kipling wrote it, as an ethos and a personal philosophy. Lines from Kipling's 'If' appear over the player's entrance to Wimbledon's Centre Court - a poignant reflection of the poem's timeless and inspiring quality.

Kipling is said to have written the poem 'If' with Dr Leander Starr Jameson in mind, who led about five-hundred of his countrymen in a failed raid against the Boers, in southern Africa. The 'Jameson Raid' was later considered a major factor in starting the Boer War (1899-1902).

6.24.2010

ఏమి జరిగింది?

ఏమి జరిగింది?

పాప ఏడ్చింది...

Woodward’s  పట్టమని వాళ్ళ అమ్మతో చెప్పు.. నేను చిన్నప్పుడు నీకు అదే పట్టేదాన్ని.. బామ్మగారి సలహ. :)
problem solved. 
*****
బామ్మగార్లు కూడా సలహా ఇవ్వలేని విధంగా ఏమన్నా జరిగితే మనదగ్గిర సమాధానమేమి ఉంటుంది? ఎవరన్నా "ఏంటి ఎమి జరిగింది? " అంటే "ఏమోనండి నాకు అర్థం కావడం లేదు" అని సమాధానం ఇవ్వవలసి వస్తోంది కొన్ని కొన్ని సంఘటనలని చూస్తే.  

ఇలాంటి ఏమి చెప్పలేని పరిస్థితి నాకు వస్తుంది అని కలలో కూడా అనుకోలేదు. ఎదన్నా ఒక విషయం గురించి చెప్పాలంటే టకా టకా చెప్పేస్తాను.. జంకు లేకుండా..అలాంటిది నేను మారాను, మారక తప్పలేదు. "అమ్మో! నేను తప్పు మాట్లాడుతున్నానేమో? ఎవరో.. ఏదో శక్తి నా పరిసరాలని చుట్టుముట్టి  నా మాటలన్ని వినేస్తోంది " అన్న భయం కలుగుతోంది. భయం అంటే గుర్తొచ్చింది, నా బాల్యం నుండి భయం అనే ఒక అనుభూతిని నేను పొందింది చాలా తక్కువ, అంటే వేళ్ళమీద లెక్కపెట్టుకోవచ్చు.  మన తప్పు లేదు అన్నప్పుడు,  దూసుకుపోడమే తెలిసినదాన్ని.  

మార్పు ఎందుకు? అంటే చెప్పలేని పరిస్థితి. ఇంతకు ముందులా ఉండడం లేదు అంటే సమాధానం ఎమో! ఎందుకిలా? ఏమి జరిగింది? తెలీదు, ఏదన్నా ఒక వస్తువు గురించి  అనుకున్నా.... "చాలా సంవత్సారాలయ్యింది ఫలనా  వ్యక్తిని చూసి.. "  అని అనుకోడం తడవు, ఆ మనిషి అదేదో నేను పిలిచినట్లుగా కళ్ళముందు వుండడం, మరీ మరీ విచిత్రంగా ఉంది. దీని ఆంతర్యమేమిటో అర్థం అవడంలేదు. అందుకే ఈ భయం.. ఎవరిమీదన్నా కోపం వచ్చేసి .. అరిచి ఎదన్నా అంటుంటే, ఆ అన్నదేదో  జరిగింది మొన్నామధ్య.. బాబోయ్ ఇదేంటి అన్న భయం..  .. అందుకే మౌనాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నాళ్ళు అంటే ఏమో.. మంచే కోరుకొన్నాను, చెడు మనసులోకి కూడా రావడంలేదు. నేను భ్రమలో ఉన్నానో, వాస్తవంలో ఉన్నానో కూడా తెలియని అగమ్య గోచరంలో ఉన్నాను.. "అబ్బా ఏంటి ఈ సోది? అసలేమి జరిగింది? అని చదివి జుట్టు పీక్కుని గట్టిగా మీరు అరిస్తే .... " -:) ఎమో ! అది తెలియకే కదా నాకు చాలా తికమకగా ఉంది అని సమాధానం..

ఇలాంటి తికమక మకతిక పరిస్థితి మీకు వచ్చిందా ఎప్పుడయినా? ఏమి జరుగుతోందో మీకు తెలియకుండా ఎమన్నా జరిగిందా? జరిగితే మీ అనుభవాన్ని చెప్పండి.. హమ్మయ్య నాకింకో తోడు ఉన్నారని భయాన్ని దూరం చేసుకుంటాను.

నా ఈ పరిస్థితి నుండి నేను తొందరగా బయటకి వచ్చేయాలని కోరుకొండి ప్లీజ్!!!.. మళ్ళీ కలుద్దాం..

అదిగో మళ్ళీ.... ఏమి జరిగిందీ అని అడుగుతున్నారు?? నాకు తెలిస్తే కదా మీకు చెప్పడానికి.... ప్చ్..
*****

Loading...