2.23.2011

మీరు చదివారా?

మాలిక బృందం నుండి వెలువడి సరికొత్తగా రూపుదిద్దుకొని కొత్త శీర్షికలతో, కొంగ్రొత్త సుగంధాలతో మీ కంప్యూటర్ దూరంలో ఉన్న వనితా మాలిక పత్రిక,  మీ రాక కోసం, మీ అభిప్రాయాలకోసం ఎదురుచూస్తోంది.

ఇప్పుడిప్పుడే బుడి బుడి అడుగులు వేస్తూ రెండో నెలలోకి అడుగుపెట్టి ...ఉన్నతికై మీ సలహాలను ... సూచనలను తనకి కావాలని విన్నవిస్తూ సంపాదకీయం, సాహిత్యం, సంస్కృతి, పాలబుగ్గలు, అందచందాలు జీవన సౌరభాలతో బాపుగారి బొమ్మలతో, సరికొత్త రూపు దాల్చి   మీకోసం ఎదురుచూస్తోంది. 

మరిక ఆలస్యమెందుకు? వచ్చేయండి దారి నేను చెప్తాగా ఇలా.... ఇక్కడనుండి..


స్వాగతం పలుకుతున్న ఈ అందాల ముద్దుగుమ్మని ఒక్కసారి పలకరించినా (క్లిక్) చాలు మీకు దారి చూపిస్తుంది లేదా కింద క్లిక్ చేసినా మీరు వనితా మాలికని చేరుకుంటారు.
****

2.13.2011

అవును అందరూ మనకి క్షమాపణ చెప్పాల్సిందే....కాని...


క్లాసులో ఒక పిల్లాడు తప్పు చేస్తే క్లాస్ మొత్తానికి శిక్ష వేస్తారు ఆ టీచర్లు. అలాగే జరుగుతోంది బ్లాగుల్లో, గత కొద్దిరోజులుగా బ్లాగులకి నేను దూరంగా  ఉండడంతో (అదే బాగుంది హాయిగా :) ) ఏమి జరిగింది అని నాకు పూర్తిగా  తెలీదు,  ఎప్పుడో పర్ణశాల బ్లాగులో "అమ్మ " పోస్ట్ విషయమై నా బ్లాగులో  ఒక పోస్ట్ రాసాను దానికి కమెంట్ వచ్చింది నాకు,  మన అభినవ పతివ్రతా శిరోమణి గారినుండి.  ఇదిగో ఇప్పుడు ఆవిడ పోస్ట్లు  చదువుతుంటే అనిపించింది మీరంతా అంటే మగజెంట్‌స్ (బ్లాగర్లంతా ) మా ఆడలేడీస్‌కి క్షమాపణ చెప్పాల్సిందే అని. రామయణంలో సీతమ్మవారిని ఎదో అనేస్తున్నారని అంటున్నారే కాని, అలాంటి సీత మీ బార్య, మీ చెల్లెలు, మీ అక్క, మీ అమ్మాగారిలా  కనపడడంలేదా మీకు,  సో, ఆవిడ అంటున్నది చెల్లెలినో, తల్లినో, అక్కనో , బార్యనో వెరసి తనని తానే అనుకుంటున్నారు కదా! మరి అలాంటప్పుడు అందరూ సీతమ్మవారికి ఎదో అనేస్తున్నారని క్షమాపణ స్తొత్రాలు, యజ్ఞాలు, యాగాలు లాంటివి చేసేసుకుంటే పాప పరిష్కారం అయిపోతుందా?

మరేమి చెయాలి అని అలా ఎక్కువగా ఆలోచించకుండా .. ఆవిడ సీతమ్మవారిని తన అస్త్రంగా ఎందుకు ఉపయోగించారో చెప్పారు కాబట్టి,  మనం కూడా సీతమ్మ అడుగుజాడలలో ఆవిడని నడిపిద్దాము. రండి మనందరం ఆమెకి తోడుగా ఉందాము.  ఆవిడ మహిళాలోకానికి క్షమాపణ చెప్పేస్తే చాలు అంటున్నారు మా పాతివ్రత్యాలని, మా వ్యక్తిత్వాలని కాపాడేవారు మీరే(మగజెంట్‌స్) . కాబట్టి, మాకందరికి ఒక లీడర్గా ఆవిడనే ఎంచుకున్నాము. ఆవిడకి మద్దతుగా మా మహిళాలోకం ఉంది. కాని... ఆమె చెయాల్సినది చేస్తే....  మేమంతా ఆమె వెనకె మీరంతా మరి క్షమాపణతో రేడీ గా ఉండండి. లేకపోతే "ఆమె బ్లాగులు మూసేసుకుని వెళ్ళిపోవాలి."   ఇదీ షరతు.

 రామాయణంలో సీతమ్మవారిని చాకలివాడేదో అన్నాడని రాములవారు శీలపరీక్ష అని, అగ్నిపరీక్ష పెట్టారు. మరిక్కడ తన ప్రశ్నలతో మనముందు వచ్చిన సాధ్వీమణి నేను పతివ్రతను కాదా  అని అడుగుతున్నారు.. ఎవరికి తెలుసు ఆవిడ పాతివ్రత్యం గురించి? నాకయితే తెలీదు. నేను (మేము)  ఆమె వెనక ఉండాలి అంటే,  ఆవిడ ప్రశ్నకి ఆవిడే సమాధానం చెప్పగలగాలి. రామాయణంలో  సీత అగ్నిపునీత అయి లోకులందరికి తానెంతటి పతివ్రతో  చెప్పారు. అలాగే ఈమె  ఆమెతో పోలుచుకున్నారు  కాబట్టి,  ఈమెను  కూడా అగ్ని పునీతని అవమనండి. అదికూడా సోనియమ్మ సమక్షంలో, ఎందుకంటే ఆడవాళ్ళని ఆడవాళ్ళే అర్థం చేసుకోగలరు.

ఇక ముహూర్తం, ప్రదేశం ఆవిడ ఇష్టం.  సీతమ్మవారికి ఏమి వంకర అని వక్రంగా రాసినా , ప్రతీ మహిళని (ఇందాకే నాన్న బ్లాగులో చదివాను) ఎదో ఒక నెపంతో బయటకి లాగి దురుసు స్వభావం చూపించినా మేమంతా మీతోనే ఉన్నామని మరోసారి నొక్కి వక్కాణిస్తున్నాము. మీరెంత పతివ్రతలో తెలియజేసి కలియుగ రామాయణాన్ని తిరగరాయండి. అగ్నిపునీత అయి వీళ్ళందరిచేత మనందరికి క్షమాపణ చెప్పించి అభినవ సీతగా పేరు పొందాలని మా ఆకాంక్ష.

చదివినవారు ఈ బ్లాగు URL  ని సోనియాగారికి పంపండి. సోనియాగారితో పాటు ఆవిడ కోరుకున్న అద్వాని గారు కూడా  వస్తారు , అభినవ సీతగారు అగ్నిపునీత అయిన మరుక్షణం మగజెంట్స్తో పాటు  ఆవిడ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పడానికి. :-)

మే"ఢం" గారు   మీరు ఢమ ఢమ లాడిస్తూ రాస్తున్న పోస్ట్లు  మగవారినో  ఇంకెవరినో బయటపెడదామనో కాదు ఒక్కసారి ఆలోచించండి. "సీత"  పేరు చెప్తూ మొత్తం మహిళాజాతిని అవమానిస్తున్నారు. ప్రస్థుతం మనమధ్య లేని సీత గురించి ఎందుకు?  ఉన్న మీ గురించి చెప్పుకొండి . పెట్టుకొండి శీర్షికలు, _______చెవుడా.. __________ఎన్నిసార్లు.........(రాయడానికి నాకే మనసొప్పడంలేదు)  -----------నవ్వింది???

 ఇంకా ముమైత్ఖాన్ నయం కదా !   ఆవిడ వృత్తి ధర్మం ఆవిడ నెరవేరుస్తున్నారు ఇంకొకరి జోలికి వెళ్ళకుండా.. మరి మీరు?

*******


"ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకోవాల్సినవి హౌ ఎక్జంప్లరీ ఆర్ యూ ఫర్ యువర్ కిడ్స్/ఫామిలి/సొసైటి. నీ పిల్లలకు/కుటుంబానికీ/సమాజానికీ నువ్వు ఎంతవరకూ ఉదాహరణగా నిలుస్తున్నావూ అని"  
 kudos Bhaskar Ramaraju గారు.



2.08.2011

స్త్రీత్వం-స్త్రీ తత్వం

 బ్రహ్మదేవుడు ముందు పురుషుడిని సృష్టించి ఆ తరువాత స్త్రీని భూమి మీదకి పంపాడట. స్త్రీని సృష్టించేప్పుడు బ్రహ్మ మదిలో లక్ష్మీ దేవి విష్ణు మూర్తి పాదాలు వత్తుతూ, పార్వతీ దేవి శివుని అర్థభాగమై నాట్యం చేస్తూ, సరస్వతీ దేవి (తన బార్య) వీనుల విందుగా వీణని వాయిస్తున్నట్లుగా, కనిపిస్తూ ఉంటే స్త్రీని సృష్టించాడు . ఈ అన్నిటి కలబోతే స్త్రీ.  అంటే ముగ్గురమ్మల ప్రతీక,  కార్యేషు దాసి, కరణేషు  మంత్రి,  భోజ్యషుమాతలా అన్నమాట.

ఇది చదవగానే అభ్యుదయభావాలు గల నాలాంటి మహిళలకి చివ్వున కోపం వచ్చేస్తుందని నాకు తెలుసు. పెళ్ళయిన కొత్తలో , "మీ అబ్బాయి ఉద్యోగం చేస్తున్నారు..  నేను చేస్తున్నాను నేనెందుకు మీ అందరికీ సేవలు చేయాలి ? మీరే నాకు చేయండి"  అని తెలిసీ తెలియని జ్ఞానంతో మా అత్తగారిని అడిగినప్పుడు .. కొత్త కదా నీకిప్పుడు తెలీదమ్మా, లక్షలు సంపాదించినా  మనం ఆడవాళ్ళమే. మనవాళ్ళకి మనం మహరాణుల్లా ( దాసిలా కాదు అని కూడా అన్నారు) చేయాల్సిందే.



"నా కుటుంబం" అని చెప్పుకోడంలో ఎంత గర్వం , ఎంత దర్పం ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఈ "నా" కుటుంబంలో పురుషాధిఖ్యత..   సమానత్వం అంటూ అర్థం లేని చిచ్చురేపి కుటుంబాన్ని బుగ్గి పాలు చేసుకోడమెందుకు,  పూర్తి వంటింటి సాధికారాన్ని మనచేతికిచ్చారని ఆనందించక..  అనిపిస్తుంది ఒక్కోసారి.

మనం వండి పెట్టకపోతే వాళ్ళే వండుకుంటారు నల భీములు వాళ్ళే కదా. కాని మన వంట కోసం ఎదురుచూసే ఆ ఆకలి బాగుంటుంది, ఆవురావురమంటు "ఈ కూర బాగుంది" "ఆ పచ్చడి బాగుంది"  అనే ఆ పొగడ్తలు ఎంత ఆనందంగా ఉంటాయి. సమానత్వ పోకడలో ఇవి ఉన్నాయా?

 అసలు సమానత్వం అంటే ఏంటి?  నువ్వు చేసే పని నేను చేయగలను అని చెప్పడమా? లేక ఎదురుపడిన ప్రతివారిని ధూషిస్తూ.. నేను అబలని కాదు సబలని , మొగరాయుడిని అని కాలర్ ఎగరేయడమా (ప్రస్తుతం స్త్రీలు ఈ ఆకారంలోనే ఉన్నారు :) ఇది తప్పని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు ) .

సున్నితత్వం ఇది ఆడదానికి భూషణం. అసలు స్త్రీత్వం అంటేనే సున్నితత్వం. కాని ఇప్పటి స్త్రీ తత్వం మోటుగా కనిపిస్తోంది. పైకి తేలరు కాని ,  ప్రతి మగవాడికి అంతో ఇంతో సున్నితంగా ఉన్న స్త్రీ అంటేనే ఇష్టపడతారు. మరీ  స్త్రీత్వాన్ని మర్చిపోయి మోటుగా మాట్లాడేవారంటే పక్కకి తప్పుకోడానికే ప్రయత్నిస్తారు.


ఆడవాళ్ళు వేషాధారణాలంకారంలో  పురుషుడికి దగ్గరై, మాటల తూటాల మనస్థత్వంలో   దూరమవుతున్నారట. ఇదే ఇప్పుడున్న ఆధునిక స్త్రీ అభ్యుదయం.


మరి ఈ అభ్యుదయమంతా స్త్రీత్వంలో అంటే పిల్లల్ని కనడంలో చూపించగలుగుతున్నారా?? ఈ సమానత్వం అప్పుడెక్కడికి వెళ్తుంది? ఇంతటి అదృష్టం అసలు మనకి ఉన్నందుకు మనం గర్వపడాలి. ఆ విధంగా మనం పురుషులకంటే ఆధిక్యంలో లేదా సమానంగా ఉన్నామని అనుకోవాలి . అంతటి గొప్ప వరం స్త్రీత్వం (తల్లి కాగలగడం.) అదో సున్నితమైన భావన.

అలాంటిది "నువ్వెంత" అంటే "నువ్వెంత"  అని పరిచయం కూడా లేనివారిని , ఒక పద్దతిలో ఉండే పెద్దవారిని,   వారేమాత్రం ఊహించలేనివిధంగా..  వెఱ్ఱి సినిమా పోకడలతో చాలా ఆధునీకంగా ఉన్నామన్న భ్రమతో , పరుష పదజాలంతో  హింసిస్తుంటే,    స్త్రీత్వానికి,  స్త్రీ సున్నితత్వానికి  విలువ ఉంటుందా?

 అసలు మనకి ఈ పిల్లల్ని కనడం, మన సున్నితత్వం,  ఎక్కువగా ఎంతో సేపు నించుని ఉండలేకపోవడం ఇవన్నీ గమనించే  " స్త్రీలని  గౌరవించడం మన (భారతీయుల) సాంప్రదాయం ..  వాళ్ళ సీట్లలో వాళ్ళని కూర్చోనిద్దాము " అంటూ  ఎక్కడచూసిన స్త్రీల మీద గౌరవాన్ని మన సాంప్రదాయ్యాన్ని (చేతలలో ఉందా లేదా అన్నది ఇక్కడ ప్రాముఖ్యం కాదు) కొనసాగిస్తున్నారు. మరి ఆ గౌరవాన్ని మనం అంటే మన మహిళలు కాపాడుకోగలుగుతున్నామా? అక్కడ పొరపాటునో లేదా సంబంధింత స్థలంలో ఎవరూ స్త్రీలు లేరు కదా అని ఎవరన్నా కూర్చున్నారో ఇక అతని పని అయిపోయిందనుకోవాలి. ఎదో ఘోర తప్పిదం చేసినట్లు అతన్ని ఆడిపోసుకుంటున్నాము. మరి ఏది అక్కడ మన సమానత్వం ?   మనకి సమానత్వం కావాలని అడుక్కోడమే అసలు పెద్ద తప్పు, "మాకు లేదు మీరివ్వండి " అంటూ అక్కడ మళ్ళీ పురుషుడికే  అధిపత్యం కట్టబెట్టాము. ఇచ్చిన స్వత్రత్ర భావాన్ని వినియోగించుకోడంలో హద్దులు మీరి ప్రవర్తిస్తున్నాము. మన స్త్రీల తత్వం ఇదా? స్త్రీత్వం సున్నితం కోల్పోతోందా?

 రామాయణాల్లో, భారతాల్లో మనం ఆచరించడానికి మంచి ఉంది , చెడు ఉంది. నిజానికి అర్థమయితే...  చెడుని వదిలేద్దాము, మంచిని స్వీకరిద్దాము. అసలివి జరిగాయా లేదా అనే చర్చ కన్నా, సీతనో సావిత్రినో ఎదన్నా అంటున్నప్పుడు..  ఆ యుగపు ఆడవాళ్ళు వాళ్ళయితే ఈ యుగపు ఆడవాళ్ళం మనం అని ఆలోచించుకోగలగాలి (దేవుళ్ళు దేవతలు పక్కన పెడితే అందరం స్త్రీలం) వాళ్ళేమి చేశారు అని కాదు,  వాళ్ళు చేసినవి మనం ఆచరించతగ్గవా లేదా అని బేరీజు చేసుకోడానికి ప్రయత్నించాలి కాని , ఎదో చేసేస్తున్నాము ఎదో కనిపెట్టేసాము అని కన్ను మిన్ను కానక గడప దాటడానికి ప్రయత్నిస్తే ఎదురుదెబ్బ తగిలి బోల్తా పడేది మనమే. మనల్ని అనే అవకాశం మనమే ఇస్తున్నాము, ఆపై సమానత్వం అంటూ గోల చేస్తాము. మనం ఎంత మంచి ఆధునికత ఉన్న స్త్రీలమో కదా !
 
అసలు నిజానికి మనం ఈ సమస్యలన్నిటినీ  పరిష్కరించగలిగే వాళ్ళమయితే ఇక్కడ ఇలా కూర్చుని, రాసుకుంటూ కాదు, ఏ మార్గంలో వెళ్తే మనమనుకుంటున్న ఈ మందిరాలు, మసీదులు నిర్మించగలమో ఆ మార్గాలు వెతుక్కుని అక్కడికెళ్ళి నేరుగా ఆ పనులు తలబెట్టినప్పుడు మన మహిళాపాటవం నలుగురికి తెలుస్తుంది. అలా చేద్దాము. కూర్చుని తీరిగ్గా  రాసుకుంటే వచ్చేదేమి ఉండదు. పోయేది మన మహిళల పరువే.
*****

2.01.2011

చేతులెత్తి...ప్రార్థిస్తున్నా మీరూ తోడు రారూ.. :(

ఏడుపంటే యాఆక్క్క్క్క్...  

అని అనుకుని కూడా ఏడవకుండా ఉండలేకపోతున్నా.. కళ్ళు రెండు మసకబారుతున్నాయి, అక్షరాలు అసలు కనపడడం లేదు. కన్నీరు వరదలై పారుతోంది. (బయట  ఎదో కలకలం వినిపిస్తోంది ఒకసారి.. ఒహో వరదలైన నా కన్నీరుని బిందెలతో పట్టుకోడానికి వచ్చారులెండి :) ) . బ్లాగు జీవితమంటే విరక్తి పుడుతోంది. ఎదో ఒకటి చేయాలి, ఏమి చేయాలి? ఇల్లంతా వెతికాను, ఎక్కడా కనపడలేదు ప్చ్.. అయినా మా ఇంట్లో ఎందుకుంటాయి రాత్రి 9 అయ్యిందంటే చాలు సుష్టుగా భోజనం చేసి,  గురక పెట్టి మరీ నిద్దుర పోతాము మేము నలుగురం (నేను మా బుచ్చిబాబు, మా పాప,  బాబు అన్నమాట) ఇక స్లీపింగ్ పీల్ కి మా ఇంట్లో స్థానం లేదు. స్లీపింగ్ పీల్ ఎందుకా? ఆత్మ హత్యన్నమాట. ఇంత మాట పడ్డాక ఇంక నేను బతకడం కష్టం,  అసలెంత మాట అనుకున్నారు.. పోని ఉరి... ప్చ్..నా హైట్ కి fan  హైట్ సరిపోడం లేదు, ఏమి చేయను నా పాపానికి నిష్కృతి లేదా? రైలు కిందా... (అమ్మో నిజంగా ఎవరూ రాకపోతే.. రక్షించడానికి హిహిహి )  .

అసలునె నేనేమి చేశాను అంటారా? ఇంతవరకు ఒక్కసారి కూడా గీతచార్య బ్లాగు కాని, ప్రియ బ్లాగు కాని , సృజన గీతం బ్లాగు కాని చదవకపోవడం, కమెంట్ రాయకపోవడం.. ఇప్పుడు కూడా అట్లాంటిక్ లో పెళ్ళిట అని ఎవరో అంటే గూగులమ్మని వేడుకుంటే మలక్ గారి పోస్ట్ చూపించింది తప్పితే , అసలు ఆ గోల ఏమిటో ఆ కథ ఏమిటో మన ప్రియ అయ్యంగారు దెయ్యంగారయిన తరువాత కదా అప్పుడప్పుడు అక్కడ అక్కడ బ్లాగుల్లో వారు ఇచ్చిన లింక్ ద్వారా ఒకటి అర పోస్ట్ చదువుతున్నా.. ఎక్కడయినా నా కమెంట్ కనపడిందా? ఎంత తప్పది? ఎక్కడన్న ఒక పుట్టినరోజు శుభాకాంక్షలు కాని, పెళ్ళిరోజు ఆశీర్వాదాలు కాని కనీసం ఒక్కటంటే ఒక ఫోటో కాని ఉందా అసలు. ఎంత పెద్ద తప్పది, ఈ బ్లాగు ప్రపంచంలోనే ఉంటూ అలాంటి బ్లాగులను పట్టించుకోకపోవడం .. ఛ ఛ నాకే చాలా విరక్తి కలుగుతోంది ఈ బ్లాగు మీద. అందుకే అందుకే ఆ విరక్తి తోటే, ఆ పశ్చాతాపం తోటే ఇదిగో ఇప్పుడు ఆత్మ హత్య అనుకున్నాను కాని, వర్క్ ఔట్ అవడం లేదు. 

అందుకే ఫైనల్ గా తీసుకున్న నిర్ణయం హిమాలయాలకి వెళ్ళి ముక్కు మూసుకుని బ్లాగులు రాసుకోడం(ముక్కు మూసుకుంటే ప్రాణాలు పోతాయేమో కదా) సరే అయితే ముక్కు మూసుకుని కాన్సెల్. అసలిదంతా ఇంత హఠాత్తుగా ఎందుకు చెప్తున్నానంటే ...ఇదిగో చూడండి మన అన్న మార్తాండ ఛాలెంజ్ నాతో.. అందుకని ...  ముహూర్తం చివర్లో చెప్తా ఎప్పుడో.
Marxist-Leninist-Feminist Revolutionary said...
ఈ సైకలాజికల్ అటాక్ కి మీరు బహిరంగ క్షమాపన చెప్పాలి. Multiple meanings లేకపోయినా అవి ఉన్నాయంటూ TestingWheel వ్రాసిన బురద జల్లుడు విమర్శలకి మీరు కూడా బాధ్యత వహించాలి.
Marxist-Leninist-Feminist Revolutionary said...
నేను జోక్ చెయ్యడం లేదు.  పది అర్థాలు వచ్చేలా వ్రాసారని మీరు నిరూపిస్తే నేను నిజంగానే సన్నాసుల మఠంలో చేరిపోతాను. నిరూపించలేకపోతే మీరు మీ కుటుంబాన్ని వదిలేసి కాషాయం కట్టుకుంటారా? చాలెంజ్ కి రెడీ అయితే praveen@pkmct.net కి మెసేజ్ పంపండి.
నాకు ఇంకా ఈ-మెయిల్ అందలేదు. రచయిత్రులు, పాఠకుల మీద సైకలాజికల్ దాడులు చేసే వాళ్ళు నాకు ఎప్పుడైనా ఈ-మెయిల్ పంపొచ్చు. చాలెంజ్ లో ఓడిపోతే నేను నిజంగా హిమాలయాలకి వెళ్ళి వైరాగ్యం స్వీకరిస్తాను.

ఇకపోతే ఈరోజే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాంటే నిన్న సాయంత్రం   6.30 కి నాకు కనువిప్పు కలిగింది ఒకానొక e mail   చదవగానే. అదికూడా ఇదిగో. 

Praveen Mandangi

 to gulabi98, me, alamurusowmya
show details 6:24 PM (6 hours ago)

Geetacharya is just simpleton. Why did you harass him? He closed all of his blogs. Why didn't you respond when real nasty writings came from the kelukudu gang in the name of dhoom and kagada? Why did you make only the Geetacharya as scapegoat? I phoned to Geetacharya yesterday. Srujana Ramanujan & Priya Iyengar's profiles are fake but the Geetacharya is the real name.


&&&&&

మార్టాండ గారు మీకు రిప్లై ఇక్కడే:

Geetacharya is just simpleton: అవునా ఇంతవరకూ మాకెవరికి తెలెయలేదే ..


Why did you harass him? : మీకెందుకలా అనిపించింది ఎక్కడన్నా మా  కమెంట్ చూశారా? మేమేమన్నా అతన్ని హింసిస్తున్నట్లుగా.. బాధిస్తున్నట్లుగా ....

I phoned to Geetacharya yesterday. Srujana Ramanujan & Priya Iyengar's profiles are fake but the Geetacharya is the real name.  : మీకు నిన్న ఫోన్ చేస్తేనే  తెలిసింది, మాకు  ఆమధ్యెప్పుడో  ప్రియ చనిపోయిందన్న రెండురోజులకే ఈ విషయం తెలిసింది చాలా లేట్ మీరు.

Why didn't you respond when real nasty writings came from the kelukudu gang in the name of dhoom and kagada?:  అండగా మీరుండగా .. మాకెందుకని.:)

సింపుల్ గా అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడండి .. అదే ఇక్కడ మార్తాండ గారు మీకోసం

వెళ్ళవయ్యా.. వెళ్ళు .. వెళ్ళూ..
 
******





ఇంత జరిగిన తరువాత నేనిక్కడ ఎలా ఉండగలను? మీరే చెప్పండి, అందుకే నాతోపాటు మీ అందరికి కూడా నా అహ్వానం మనందరం కలిసి హాయిగా హిమలయాల్లో బ్లాగుదాం వచ్చేయండొచ్చేయండొచ్చేయండి. :) ఇక ముహూర్తమంటారా ఇదుగిదిగిదుగో :

 శుభవాసర,  శుభ నక్షత్ర,,  శుభ యోగే.. తేదీ  " 25-20-2011" 

అందరు నాకు తోడు వస్తున్నారుగా మరి.. ఏది వచ్చేవాళ్ళందరూ " ఓ"  అని ఒక వ్యాఖ్య రాసేయండి. :)

 *******
Loading...