11.21.2017

వనభోజనం-మనభోజనం 5. ఇలపకుర్తి రాధాదేవి గారు



అనర్గళంగా మాట్లాడుతూ, ఆశువుగా అమ్మవారి పాటలను తన గొంతులో పలికించగల అమ్మగారు శ్రీమతి ఇలపకుర్తి రాదాదేవిగారు. మనకి సుపరిచితురాలు కాఫీ విత్ కామేశ్వరి గారి అమ్మగారు. సరస్వతీ  కటాక్షం అమ్మగారి  వర్చస్సులో గోచరిస్తూ ఉంటుంది. పాట పాడుతున్నప్పుడు అమ్మవారు అక్కడ ఆసీనులై రాగమాలపిస్తున్నారా అన్నంత సుందరంగా ఉంటుంది ఆ గాన మాధుర్యం. తానూ రాలేకపోయినా వీల్ చైర్ లో వనభోజనాలకి వచ్చి కార్తీకమాస వనభోజనాలకి తన భక్తిరస గానమాధ్యుర్యంతో ఒక హుందాతనాన్ని తీసుకువచ్చిన అమ్మ శ్రీమతి ఇలాపకుర్తి రాధాదేవి గారు.. ఆవిడ తన స్వీయ గీతాలని ఎలా ఆలపిస్తారు ఏవిధంగా తాను పాడగలను అన్న విషయాన్ని కూడా అక్కడ అందరికి విడమర్చి చెప్పారు. అంతా అమ్మవారి కటాక్షం నాదేమి లేదు అంటారు అమ్మ. అంతే కాదు వనభోజనాలని కూడా ఏంతో ప్రశంసించారు. సుందరకాండ ఆలపిస్తూ ....... వనభోజనాలు చాలా చూసాను ఇవే అసలయిన వనభోజనాలు అని ఆమె నుండి రావడం మనందరికీ దీవెనలవంటివి. అమ్మగారికి సదా పాదాభివందనంలతో ఇదిగో మీరు వినండి ఆ గాన మాధుర్యం.  




ఆవిడే కాదు శ్రీమతి ఇలాపకుర్తి రాధాదేవి గారి కుటుంబం వారి పెద్దమ్మాయి మన కాఫీ విత్ కామేశ్వరి, కామేశ్వరి గారి చెల్లెలు శ్రీమతి పద్మజ గారు, కామేశ్వరి కోడలు శ్రీమతి వాణి గారు, వాణి గారి ముద్దులొలికే ఇద్దరు పిల్లలు, కామేశ్వరిగారి స్నేహితురాలు శ్రీమతి ఉమాదేవి కల్వకోట గారు ఈ వనభోజనాలకి వచ్చిన ప్రముఖులలో ముఖ్యులు.



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

Loading...